Advertisementt

ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడంట!

Tue 11th Aug 2015 05:42 AM
ntr,rajamouli,mahabharatham,sreekrishna role,bahubali2  ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడంట!
ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడంట!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో గతంలో 'స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌, సింహాద్రి, యమదొంగ' చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా జక్కన్న ఆయనతో సినిమాలు తీసి ఆయన కెరీర్‌ను గాడిలో పెడుతూ వచ్చాడు. అయితే వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చి చాలాకాలం అయింది. అయితే మళ్లీ వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ విషయం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. తనకు మహాభారతం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, అందులో శ్రీకృష్ణుడి పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేత చేయించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఆయన ఇక్కడో ట్విస్ట్‌ రివీల్‌ చేశాడు. తను మహాభారతం మొదలుపెట్టడానికి పదేళ్ల సమయం పడుతుందని అన్నాడు. ఎన్టీఆర్‌కు యాక్టింగ్‌ పవర్‌, వాయిస్‌ మాడ్యులేషన్‌, డిక్షన్‌ వంటివి అద్భుతమని, అలాంటి చాలెంజింగ్‌ పాత్రలకు ఏమేమి కావాలో అన్ని ఆయనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం మాత్రం తన దృష్టి 'బాహుబలి2' మీదనే ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ