Advertisementt

అన్నయ్యకు సాయం చేస్తోన్న తమ్ముడు!

Tue 11th Aug 2015 04:12 AM
ntr,kalyan ram,ntr arts banner,kick 2,raviteja  అన్నయ్యకు సాయం చేస్తోన్న తమ్ముడు!
అన్నయ్యకు సాయం చేస్తోన్న తమ్ముడు!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఉప్పు, నిప్పు అనే విదంగా ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు ఈమధ్య బాగా కలిసిపోయారు. విషయానికి వస్తే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌ను నెలకొల్పి కోట్లు పోగొటుకున్నాడు కల్యాణ్‌రామ్‌. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో ఆయన తీసిన సినిమాలన్నింటికలో 'అతనొక్కడే, పటాస్‌' చిత్రాలు మాత్రమే ఆయనకు ఆర్థికంగా కాస్త ఊరటనిచ్చాయి. ఈ బేనర్‌లో ఆయన ఇప్పటిదాకా కేవలం తాను హీరోగా నటించే చిత్రాలనే నిర్మించాడు. అయితే తాజాగా రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'కిక్‌2'ను నిర్మించాడు. ఓవర్‌ బడ్జెట్‌, రీషూట్స్‌ కారణంగా ఏకంగా 15కోట్లదాకా ఆయనకు డెఫిషిట్‌ ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో కళ్యాణ్‌రామ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని తమ్ముడు ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు. 'కిక్‌2'కి ఆర్థికంగా ఇప్పటికే ఎన్టీఆర్‌ సాయం అందించాడని అందువల్లే ఈ చిత్రం విడుదలకు సిద్దమైందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇక త్వరలో ఎన్టీఆర్‌ తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ బేనర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో పెట్టుబడులు పెట్టి సినిమాల నిర్మాణం చేయనున్నాడని, అయినా నిర్మాతగా తన పేరు వేసుకోకుండా తన అన్నయ్య పేరు మీదనే చిత్రాలు తీయడానికి రెడీ అయ్యాడట. త్వరలో ఈ బేనర్‌లో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్నాడని, ఆ చిత్రానికి కూడా పెట్టుబడి ఎన్టీఆరే పెట్టనున్నాడని సమాచారం. అఫీషియల్‌గా సొంత బేనర్‌ను పెట్టకుండా తన అన్నయ్య బేనర్‌పైనే సినిమాలు తీయడానికి కారణం ఏమిటా? అనే విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ