టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ హవా కొనసాగుతోంది. ఈసారి ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు హీరోలు కలిసి నటించడానికి సిద్దపడుతున్నారనేది ఫిల్మ్‌నగర్ టాక్. హాలీవుడ్ సినిమా 'వారియర్' ఆధారంగా బాలీవుడ్‌లో 'బ్రదర్స్' అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం సక్సెస్ అయితే చాలు... ఈ చిత్రం సౌతిండియన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకొని ముగ్గురు స్టార్స్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్, ప్రబాస్, రానాలను నటింపజేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య, కార్తి, విక్రమ్‌లతో కూడా తీయాలని, ఒకేసారి రెండు భాషల్లోనూ నిర్మించాలని ఆ కార్పొరేట్ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి బాలీవుడ్‌లో 'బ్రదర్స్' విజయం సాధిస్తుందో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే అదో సంచలనమే అవుతుందని చెప్పవచ్చు.