కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు, శృతిహాసన్ జంటగా నటించిన 'శ్రీమంతుడు 'చిత్రం అన్నిచోట్లా పాజిటివ్ టాక్‌తో సూపర్‌హిట్టు దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రంలో మహేష్ లుక్స్‌కి, అతని పెర్‌ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. హీరోగానే కాకుండా ఈ చిత్రంతో నిర్మాతగా కూడా వ్యవహరించిన మహేష్‌బాబు ఈ చిత్రంతో నిర్మాతగా కూడా బోణీ కొట్టాడు. ఇక టాలీవుడ్‌లో ఎప్పటినుండో ఉన్న ద్వితీయ విఘ్నాన్ని దర్శకుడు కొరటాల శివ అధిగమించాడు. ఇలా ద్వితీయవిఘ్నాన్ని దాటిన వారిని టాలీవుడ్‌లో వేళ్ల మీద లెక్కించవచ్చు. ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నాడని చెప్పవచ్చు. అంతేకాదు.. ఇప్పటివరకు టాప్ స్టార్స్ అయిన పవన్‌కు 'గబ్బర్‌సింగ్', రవితేజకు 'బలుపు', రామ్‌చరణ్‌కు 'ఎవడు', అల్లుఅర్జున్‌కు 'రేసుగుర్రం' వంటి విజయాలను అందించిన శృతిహాసన్ ప్రస్తుతం రెండు ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహేష్‌కు కూడా 'శ్రీమంతుడు'తో సూపర్‌హిట్టును అందించింది. ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే ఆమె సక్సెస్‌ను ఇవ్వలేకపోయిందని, త్వరలో ఆమె తెలుగులో ఎవరి చిత్రంలో నటించడానికి ఒప్పుకొంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.