Advertisementt

కోలీవుడ్‌పై దృష్టిసారించిన మహేష్‌!

Mon 10th Aug 2015 03:55 AM
mahesh babu,sreemanthudu,kollywood,brahmothsawam  కోలీవుడ్‌పై దృష్టిసారించిన మహేష్‌!
కోలీవుడ్‌పై దృష్టిసారించిన మహేష్‌!
Advertisement
Ads by CJ

ఇంతకాలం మహేష్‌బాబు టాలీవుడ్‌పై తప్ప ఇతర భాషలపై తన దృష్టి సారించలేదు. అయితే మొదటిసారిగా ఆయన నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూదా ఒకేరోజున విడుదల చేసి సక్సెస్‌ అయ్యాడు. అయితే ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే అని, రాబోయే రోజుల్లో మరింతగా తమిళంపై ఫోకస్‌ పెట్టి అక్కడ కూడా మంచి క్రేజ్‌ సంపాదించే పనిలో మహేష్‌ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.ి 'బ్రహ్మూెత్సవం'తో ఈ విషయం గురించి మహేష్‌ మరింత సీరియస్‌గా దృష్టి సారించనున్నాడు. 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని అసలుసిసలైన తమిళ చిత్రంగా రూపొందించి తానే డబ్బింగ్‌ చెప్పడంతో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలను సైతం జోరుగా జరపడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి తమిళంలో మహేష్‌ తాను అనుకున్న స్థాయి విజయాన్ని సాధించగలడా? లేక గతంలో కొందరు హీరోల మాదిరిగా ఇది ఆరంభశూరత్వమే అనిపిస్తాడా? అనేది చూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ