నాగచైతన్య కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన చిత్రం 'ఏ మాయ చేశావే'. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. మరలా ఐదేళ్ల గ్యాప్ తర్వాత గౌతమ్‌మీనన్ నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'దోచెయ్' చిత్రం ఇచ్చిన షాక్ నుండి ఇంకా కోలుకోని చైతూ గౌతమ్‌మీనన్ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రానికి 'వెంటాడు' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు సమాచారం. వినడానికి మాస్ టైటిల్‌గా ఉన్నప్పటికీ సినిమా మాత్రం టైటిల్‌ను జస్టిఫై చేసేవిధంగా ఉంటుందని యూనిట్ సభ్యుల అభిప్రాయం. మరి ఈ చిత్రమైనా చైతూ కెరీర్‌ను గాడిలో పెడుతుందో లేదో చూడాలి...!