అల్లుఅరవింద్ రామ్‌చరణ్‌కు అన్యాయం చేశాడా? అంటే అవుననే అంటున్నాడు రాజమౌళి. 'బాహుబలి' చిత్రాన్ని అన్ని భాషల్లో కలిపి 500కోట్ల మార్క్ కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' సినిమా కూడా భారీగా వసూళ్లు సాధించి అప్పట్లో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ విషయం గుర్తుచేసుకుంటూ రాజమౌళి ఏమన్నాడంటే... 'మగధీర' చిత్రాన్ని తీసేటప్పుడే దానిని నేను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయమని నిర్మాత అల్లుఅరవింద్‌కు సూచించాను. కానీ తెలుగులో విడుదలైన సంవత్సరం తర్వాత తమిళంలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఆ చిత్రం నాలుగు కోట్ల వరకు వసూలు చేసింది. అదే నేను చెప్పినట్లు చేసివుంటే 'మగధీర' వసూళ్లు మరింతగా పెరిగేవి.. అన్నాడు. అదే రాజమౌళి చెప్పినట్లు చేస్తే 'మగధీర' అప్పుడే ఎన్నో రికార్డులను తుడిచిపెట్టేదని ట్రేడ్‌వర్గాలు అంగీకరిస్తున్నాయి.