'బాహుబలి' చిత్రంపై మొదటి పోస్టర్ నుంచి కాపీ వివాదం వస్తూనే ఉంది. అయితే ఎప్పుడూ ఈ వార్తలను రాజమౌళి ఖండించలేదు... సమర్థించనూ లేదు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'బాహుబలి'లో కట్టప్ప ఇమేజ్ గుర్తుండిపోయేది. ప్రభాస్ కాలు తీసి తల మీద పెట్టుకొనే సీన్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సీన్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు నేను 'చంఘీజ్‌ఖాన్' సినిమా చూశాను. అందులో ఓ ఆజానుభాహుడు, గుండు చేసుకున్న వ్యక్తి హీరో కాలుతీసి తల మీద పెట్టుకుంటాడు. అది నాకు బాగా గుర్తుంది. నాన్నగారితో గత పదిసంవత్సరాలుగా ఇలాంటి సీన్‌ను పెట్టవచ్చా అని అడుగూతూనే ఉన్నాను. ఇంతకాలానికి అది 'బాహుబలి'తో తీరింది. నాపై కాపీ విమర్శలు చేసేవారు ఈ పాయింట్ పట్టించుకోలేదు. ఏదో యాదృచ్చికంగా నేను తీసే మామూలు సీన్లను కాపీ అంటూ గోలపెట్టే వారు .. నిజంగా నేను చేసిన నిజమైన కాపీలను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.. అంటూ విమర్శకులపై ఎదురుదాడికి దిగాడు.