తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఓవర్‌సీస్‌లో కూడా చాలా క్రేజ్ ఉంది. అందుకే ఆయన చేసిన ఫ్లాప్ చిత్రాలు కూడా ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. తాజాగా 'శ్రీమంతుడు' చిత్రాన్ని అమెరికాలో రికార్డు స్థాయిలో 150 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని మహేష్ వీరాభిమానులు ఈ చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించిన తొలి 10 టిక్కెట్లను ఏకంగా 15000 అమెరికన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. మన కరెన్సీ ప్రకారం ఆ 10టిక్కెట్ల విలువ 9లక్షల 58వేలు . అభిమానులను చూశాం..కానీ మరీ ఈ రేంజ్‌లో డబ్బులు ఖర్చుపెట్టి టిక్కెట్లను కొనే అబిమానులను ఇప్పుడు చూస్తున్నాం... అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఇలా సినిమా టిక్కెట్ల కోసం వెచ్చించిన మొత్తాలను సమాజసేవకు అందిస్తే పుణ్యం, పురుషార్థం రెండూ ఉంటాయి కదా! అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.