హాలీవుడ్ సినిమా 'ఫేస్‌ఆఫ్'ను దర్శకుడు వంశీ పైడిపల్లి రామ్‌చరణ్, అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో 'ఎవడు'గా తీసి విజయం సాధించాడు. తాజాగా ఆయన మరోసారి అదే పని చేస్తున్నాడు. ఈసారి ఫ్రెంచ్ సినిమాను వాడేస్తున్నాడు. నాగార్జున, కార్తీల కాంబినేషన్‌లో వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ సినిమాను 'ది ఇన్ టచ్‌బుల్స్' అనే ఫ్రెంచ్ మూవీని కాపీ కొట్టి తీస్తున్నాడని ఇటీవల విడుదల చేసిన నాగార్జున వీల్‌చైర్‌లో ఉన్న ఫొటోనిబట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతవరకు ఆ చిత్రం విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని అర్థమైంది. ఈ చిత్రంలో ఓ ధనవంతుడు, అప్పుడే జైలు నుండి విడుదలైన ఓ ఖైదీ కథ ఇది. యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి వీల్‌చైర్‌కే పరిమితమైన ఓ ధనవంతుడు ఓ కేర్‌టేకర్‌ను నియమించుకుంటాడు.అలా ఈ చిత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. మరి 'ఎవడు'లాగానే ఈ చిత్రాన్ని కూడా వంశీపైడిపల్లి తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తనదైన శైలిలో తీసి మెప్పిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...!