Advertisementt

బాహుబలి తర్వాత రాజమౌళి మూవీ ఇదేనా?

Thu 06th Aug 2015 04:06 AM
ss rajamouli,eega,eega 2 movie,bahubali,mahesh babu  బాహుబలి తర్వాత రాజమౌళి మూవీ ఇదేనా?
బాహుబలి తర్వాత రాజమౌళి మూవీ ఇదేనా?
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడం బాగా వర్కౌట్‌ అయింది. మొదటిభాగం ఇప్పటికే 500కోట్లు వసూలు చేసింది. ఇక రెండో భాగం కూడా 500కోట్లకు పైగానే వసూలు చేస్తుందని ట్రేడ్‌ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. సో.. 'బాహుబలి' చిత్రం రాజమౌళికి 1000కోట్ల సినిమాగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే 'బాహుబలి' తర్వాత రాజమౌళి ఏ చిత్రం చేస్తాడు? అనే విషయం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. మహేష్‌బాబుతో సినిమా ఉన్నప్పటికీ దానికి ఇంకా చాలా సమయం ఉందని రాజమౌళి భావిస్తున్నాడు. దీంతో ఆయన ఇప్పుడు 'ఈగ' చిత్రానికి సీక్వెల్‌గా 'ఈగ2' తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉన్నాడట. 'ఈగ' సీక్వెల్‌ను మరింత పెద్ద స్కేల్‌తో తీస్తే అది తనకు సేఫ్‌ అని జక్కన్న భావిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇదే వాస్తవ రూపం దాలిస్తే.... ఆల్‌రెడీ 'ఈగ'ను దాదాపు అన్ని భాషల్లో అనువాదం చేసిన రాజమౌళికి 'బాహుబలి' క్రేజ్‌ పెద్ద ఎస్సెట్‌ అవుతుందని చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ