దక్షిణాదిన సీనియర్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ పాత్రలను పోషిస్తున్న నటి రమ్యకృష్ణ నటన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సత్తా ఒకప్పటి 'నరసింహ' నుండి నిన్నటి 'బాహుబలి' వరకు అందరూ ఒప్పుకొంటారు. అందాల బామగా, అమ్మగా, అమ్మోరుగా టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌ను ఆమె ఉర్రూతలూగిస్తోంది. రజనీకాంత్ సూపర్‌హిట్ మూవీ 'నరసింహ'లో నీలాంబరిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రజనీతో పోటీగా ఇంకా చెప్పాలంటే సూపర్‌స్టార్ రజనీని మరిపించే స్థాయిలో నటించిన రమ్యకృష్ణ యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. ప్రేక్షకులకే కాదు... రమ్యకృష్ణకు కూడా నీలాంబరి క్యారెక్టర్ అంటే ఎంతో ఇష్టం. మొన్నీమద్య 'నరసింహ' సినిమా రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్ ఎవరు పోషిస్తే బాగుంటుంది అని మీరు ఫీలవుతున్నారు? అని కొందరు మీడియా ప్రతినిదులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్ పోషించే నటిని తాను ఎక్కడా చూడలేనని, ఒక వేళ సినిమా రీమేక్ చేస్తే అందులోనూ నీలాంబరిగా తానే నటిస్తానని చెప్పింది. మొత్తానికి రమ్యకృష్ణ తనకు తానే సాటి అనుకుంటోందని స్పష్టం అవుతుంది.