Advertisementt

రాజమౌళికి 20కోట్ల ఆఫర్‌!

Wed 05th Aug 2015 04:55 AM
rajamouli,bahubali,karanjohar,sanjay leela bhansali  రాజమౌళికి 20కోట్ల ఆఫర్‌!
రాజమౌళికి 20కోట్ల ఆఫర్‌!
Advertisement
Ads by CJ

'బాహుబలి' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయంతో ఏకంగా 500కోట్ల క్లబ్‌లో చేరింది. అపజయం ఎరుగని దర్శకునిగా రాజమౌళి సత్తా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుండో తెలుసు. ఇప్పుడు ఆయన సత్తా ఏమిటో? ప్రపంచానికి మొత్తం తెలియడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మాత్రం 'బాహుబలి' తర్వాతే. ఓ తెలుగు సినిమా హిందీలో అనువాదమై 100కోట్లు వసూలు చేయడం కనివిని ఎరుగని విషయం. అదే ఆయన నేరుగా బాలీవుడ్‌ స్టార్లతో సినిమా తీస్తే భారీ వసూళ్లు సాధించే సినిమా తీయడం ఖాయం అని బాలీవుడ్‌ నిర్మాతలు నమ్ముతున్నారు. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో రాజమౌళి గురించి బాగా తెలిసిన బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ కరణ్‌జోహార్‌ హిందీలో ప్రమోట్‌ చేశాడు. రాజమౌళి సినిమా విషయంలో కరణ్‌జోహార్‌ నమ్మకం నిజమైంది. తాజాగా కరణ్‌జోహార్‌ రాజమౌళికి మరో ఆఫర్‌ ఇచ్చాడు. 20కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తానని, హిందీలో ఓ సినిమా చేసిపెట్టమని ఆయన పట్టుబడుతున్నాడట. వాస్తవానికి రాజమౌళికి చాలాకాలం నుండి బాలీవుడ్‌ ఆఫర్లు వస్తున్నాయి. 'విక్రమార్కుడు' సినిమాను హిందీలో రీమేక్‌ చేయమని మొదట రాజమౌళినే అడిగాడు సంజయ్‌ లీలా భన్సాలి. అయితే అప్పటికే రాజమౌళి తన దృష్టినంతా 'బాహుబలి' మీద పెట్టడంతో నో అని చెప్పాడు. మరి కరణ్‌జోహార్‌ ఆఫర్‌కు రాజమౌళి ఏమంటాడో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ