Advertisementt

'శ్రీమంతుడు' పై జగపతి బాబు నాట్ హ్యాపీ!

Tue 04th Aug 2015 06:40 AM
jagapathibabu,sreemanthudu,mahesh babu,koratala siva  'శ్రీమంతుడు' పై జగపతి బాబు నాట్ హ్యాపీ!
'శ్రీమంతుడు' పై జగపతి బాబు నాట్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

కష్టపడి, ఇష్టపడి చేసిన సన్నివేశాలను ఎడిటింగ్‌ పేరుతోనో, లేక సినిమా నిడివి తగ్గించే ఉద్దేశ్యంతోనో వాటిని తొలగిస్తే ఏమనిపిస్తుంది? ఆ నటుడు, లేదా నటి బాగా ఫీలవ్వడం ఖాయం. ఇప్పుడు జగపతిబాబు పరిస్థితీ అంతేనట...! 'శ్రీమంతుడు'లో జగపతిబాబు మహేష్‌బాబుకు తండ్రిగా నటించాడు. ఈ సినిమా కోసం నెలరోజుల కాల్షీట్స్‌ కూడా కేటాయించాడు. అందుకుగాను భారీ మొత్తంలో పారితోషికం కూడా అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు నటించిన కొన్ని పవర్‌ఫుల్‌ సీన్స్‌ను తొలగించారట. ఎంతో కష్టపడి నటించి తనకు మంచి పేరు వస్తుందని భావించిన సీన్స్‌ను తొలగించడంతో ఆయన బాగా బాధపడుతున్నట్లు సమాచారం. ఫైనల్‌అవుట్‌పుట్‌ చూసిన జగపతిబాబు తన సీన్లు కత్తిరించడం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. దీంతో ఆయన్ను శాంతింపజేసేందుకు మహేష్‌బాబుతో పాటు కొరటాల శివ కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. తన కెరీర్‌కు 'శ్రీమంతుడు' ఇంకాస్త మైలేజీ ఇస్తుందని భావించి ఎన్నో ఆశలు పెట్టుకున్న జగపతిబాబుకు ఇది చేదు వార్తే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ