Advertisementt

మంచి నిర్మాత చేతిలో పడిన ఉపేంద్ర!

Tue 04th Aug 2015 06:15 AM
upendra,son of sathyamurthy,nallamalupu bujji,upendra2  మంచి నిర్మాత చేతిలో పడిన ఉపేంద్ర!
మంచి నిర్మాత చేతిలో పడిన ఉపేంద్ర!
Advertisement
Ads by CJ

అప్పట్లో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన 'ఉపేంద్ర' చిత్రాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ చిత్రం తెలుగునాట కూడా ఘనవిజయం సాధించి ఉపేంద్రకు ఎంతో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చింది. ఈ చిత్రం తర్వాత ఉపేంద్రకు ఎనలేని క్రేజ్‌ వచ్చింది. అప్పడు వచ్చిన ఆ క్రేజే ఇప్పటికీ ఉపేంద్రను తెలుగు ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది. అప్పటి ఆ గుర్తింపే ఇటీవల వచ్చిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో ఉపేంద్రకు స్థానం దక్కేలా చేసింది అనడంలో అతిశయోక్తి కాదు. కాగా ఇప్పుడు 'ఉపేంద్ర' చిత్రానికి సీక్వెల్‌ సిద్దమవుతోంది. పారుల్‌ యాదవ్‌, క్రిస్టినా అకివా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను 'ఉపేంద్ర2' పేరుతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి)తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రం కన్నడలో విడుదలకు సిద్దమవుతోంది. కాగా నిర్మాత బుజ్జి కెరీర్‌ కూడా ఉపేంద్ర హీరోగా నటించిన 'రా' చిత్రంలో మొదలవ్వడం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ