సరికొత్త కథాంశాలతో వరుస విజయాలు సాదిస్తున్న యంగ్‌హీరో నిఖిల్. తెలుగులో ఏ హీరోకైనా హ్యాట్రిక్ హిట్ అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ ఘనతను ఇటీవల నిఖిల్ సాధించాడు. ప్రస్తుతం ఆయన 'శంకరాభరణం' తో మరో సరికొత్త క్రైమ్ కెమెడీ చేస్తున్నాడు. కోనవెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో నిఖిల్ సరసన మెయిన్ హీరోయిన్‌గా నందిత నటిస్తోంది. ఇక రెండో హీరోయిన్‌గా నటించేందుకు హాట్ భామ దీక్షాపంత్‌ను ఎంపిక చేశారు. గతంలో హాట్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీక్షాపంథ్ పవన్‌కళ్యాణ్, వెంకటేష్‌లు కలిసి నటించిన 'గోపాల గోపాల' సినిమాలో సన్యాసిని పాత్రలో బాగా అలరించింది. కాగా 'శంకరాభరణం'లో ఆమె ఓ ఎన్.ఆర్.ఐ. అమ్మాయిగా నటించనుంది.