'బాహుబలి' పుణ్యాన హిందీలోనూ తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు సినిమాలను డబ్ చేయడానికి అక్కడి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా 'శ్రీమంతుడు'సినిమాకి అక్కడ మంచి ధర దక్కినట్లు తెలుస్తోంది. 'శ్రీమంతుడు' హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను కలగలిపి 5కోట్లకు అమ్మేశారట. ఇది ఊహించని ప్రాఫిట్ అంటున్నారు. ఇదివరకు మహేష్ సినిమాలకు అక్కడ అంత డిమాండ్ లేదు. ఏదో డబ్ చేసి శాటిలైట్‌కి అమ్మేసేవారు. సుమారు ఒక్కో చిత్రానికి ఆ విధంగా 75లక్షల నుండి 1కోటి వరకు వచ్చేవి. ఈసారి ఏకంగా 5కోట్లు ధర పలకడం 'బాహుబలి' పుణ్యమే అంటున్నారు. మరి 'శ్రీమంతుడు' బాలీవుడ్ జనాలను కూడా అలరించగలిగి, 'బాహుబలి' పేరు చెడగొట్టకుండా ఉంటే చాలని టాలీవుడ్ జనాలు కోరుకుంటున్నారు.