Advertisementt

సీనియర్‌ ఎన్టీఆర్‌తో పవన్‌కు పోలిక!

Tue 04th Aug 2015 03:41 AM
senior ntr,pawan kalyan,sardhar,sardhaar papa rayudu  సీనియర్‌ ఎన్టీఆర్‌తో పవన్‌కు పోలిక!
సీనియర్‌ ఎన్టీఆర్‌తో పవన్‌కు పోలిక!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'సర్దార్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ జాయిన్‌ అయ్యాడు. అంతవరకు భారీ గడ్డంతో దర్శనమిచ్చిన పవన్‌ ఈ చిత్రం కోసమే గడ్డం పెంచాడని అనుకున్నారు. కానీ పవన్‌ మాత్రం క్లీన్‌షేవ్‌తో షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. అయితే ఈ చిత్రంలో పవన్‌ గడ్డంతో నటించే ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయని, వాటిని షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని, సో.. పవన్‌ మరోసారి ఈ చిత్రం కోసం గడ్డం పెంచనున్నాడని తెలుస్తోంది. దానికి రిహార్సిల్స్‌గా ఉంటుందనే పవన్‌ భారీ గెడ్డం పెంచి తన లుక్‌ ఎలా ఉంటుందో టెస్ట్‌ చేసుకున్నాడని సమాచారం. ఇక ఇందులో ఆయన గెటప్‌తోపాటు ఇతర విషయాల విషయంలో కూడా ఆయననకు సీనియర్‌ ఎన్టీఆర్‌తో పోల్చిచూస్తున్నారు సినీ జనాలు. ఈ సినిమా టైటిల్‌, గెటప్‌ ఇవ్వన్నీ సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'సర్దార్‌పాపారాయుడు'కు దగ్గరగా ఉన్నాయని, టైటిలే కాకుండా ఇతర విషయాల్లో కూడా పోలిక ఉందని అంటున్నారు. ఎన్టీఆర్‌ 'సర్దార్‌పాపారాయుడు' చిత్రాన్ని కూడా ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి పూర్తి స్థాయి ఎంట్రీ ఇచ్చే నేపథ్యంలోనే చేశాడని, అలాగే పవన్‌ కూడా పూర్తి స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సందర్బంలోనే 'సర్దార్‌' చిత్రం చేయడం ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణం అవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ