Advertisementt

గోపీసుందర్ లిస్టు లోకి మరో మూవీ!

Mon 03rd Aug 2015 03:20 AM
gopi sundar,malayalam music director,dosth,santhosham sagam balam  గోపీసుందర్ లిస్టు లోకి మరో మూవీ!
గోపీసుందర్ లిస్టు లోకి మరో మూవీ!
Advertisement
Ads by CJ

మలయాళంలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న గోపీసుందర్‌ ఇటీవల ఒకటి అరా చిత్రాలకు సంగీతం అందించి టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఇప్పుడు వరుసగా మూడు చిత్రాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్‌లో బిజీగా మారాడు. ఆయన సంగీతం అందిస్తున్న నాని చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. అలాగే నాగార్జున-కార్తి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ మూవీ 'దోస్త్‌' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రానికి కూడా గోపీసుందరే సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఆయన వెంకటేష్‌ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సంతోషం సగం బలం' చిత్రానికి సైతం ఆయనే మ్యూజిక్‌ను అందిస్తుండటం విశేషం. మొత్తానికి ఈ సంగీత దర్శకుడు నేటితరం తెలుగు యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లకు బాగానే పోటీ ఇస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ