Advertisementt

'శ్రీమంతుడు' దెబ్బకి పవన్‌ రికార్డ్స్ అవుట్!

Sun 02nd Aug 2015 02:03 PM
srimanthudu,mahesh babu,pawan kalyan,attarintiki daaredi  'శ్రీమంతుడు' దెబ్బకి పవన్‌ రికార్డ్స్ అవుట్!
'శ్రీమంతుడు' దెబ్బకి పవన్‌ రికార్డ్స్ అవుట్!
Advertisement
Ads by CJ

ఇటీవల వచ్చిన 'బాహుబలి' అత్యద్బుత కలెక్షన్లు సాధిస్తూ.. కనుచూపు మేరలో తనను బ్రేక్‌ చేసే సినిమా ఇప్పట్లో రాదని ప్రూవ్‌ చేస్తోంది. దీంతో కనీసం 'బాహుబలి' రికార్డును పక్కన పెట్టిన మహేష్‌బాబు 'శ్రీమంతుడు' కలెక్షన్లలో రెండో స్థానంలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ 'అత్తారింటికి దారేది' స్థానంపై కన్నేశాడు. ' బాహుబలి' మొదటి స్థానాన్ని పక్కనపెట్టి 'అత్తారింటికి దారేది' స్థానంపై కన్నేయడంతో పాటు ఆ రికార్డును ఖచ్చితంగా 'శ్రీమంతుడు' బద్దలు కొడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరిగిన సినిమా టిక్కెట్ల ధరలు, మొదటివారం పెంచుకోనున్న ధరలు, ఇక 'బాహుబలి' తరహాలో ప్రీమియర్‌షోల ద్వారా సంపాదించే కలెక్షన్లు... వీటి పుణ్యాన మహేష్‌ 'శ్రీమంతుడు' బాగానే కొల్లగొడుతుందని, సినిమా మరీ '1, ఆగడు' రేంజ్‌లో లేకుండా హిట్టయితే చాలు పవన్‌ రికార్డు బద్దలు కొట్టడం ఖాయమని, సినిమా సూపర్‌హిట్టు అయితే 100కోట్ల మార్కు సాధించడం కూడా పెద్ద అసాధ్యం ఏమీ కాదని మహేష్‌ అభిమానులు ఆశపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ