నేటిరోజుల్లో కొన్ని కొన్ని వివాదాల వల్ల సినిమా క్రేజ్ మరింత పెరగడం, ఏమిటా వివాదం? అని తెలుసుకోవడానికైనా సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించడం సాధారణమైన అంశంగా, పబ్లిసిటీలో ఓ భాగంగా తయారైంది. విషయానికి వస్తే... 13వ శతాబ్దపు వీరనారి రుద్రమదేవి జీవితాన్ని 'రుద్రమదేవి' టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఈ చిత్రంలో ఆమె వీరత్వాన్ని మాత్రమే కాకుండా రొమాంటిక్ యాంగిల్‌ను కూడా తెరపై ఆవిష్కరించాడట. 'ఔనా నీవేనా...' సాంగ్ ట్రైలర్ విడుదలైనప్పుడే ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల విడుదలైన 'బాహుబలి' సినిమా విషయంలో 'పచ్చబొట్టేసిన...' సాంగ్ వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో 'రుద్రమదేవి' సినిమా విడుదలైన తర్వాత కూడా 'ఔనా నీవేనా' సాంగ్ వివాదాస్పదం అవుతుందేమోనని సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీరనారి రుద్రమదేవిని రొమాంటిక్ యాంగిల్‌లో చూపించడం హద్దుల్లో ఉంటే ఓకే. హద్దు దాటితే మాత్రం విమర్శలు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఏదిఏమైనా సినిమా విడుదలైతే కానీ గుణశేఖర్ 'రుద్రమదేవి'నితెరపై ప్రజెంట్ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటుందో ? విమర్శల పాలవుతుందో చెప్పడం కష్టం.