Advertisementt

త్రివిక్రమ్ మళ్లీ టార్గెట్ పెట్టాడు!

Sat 01st Aug 2015 03:27 AM
trivikram srinivas,nithiin,youth  త్రివిక్రమ్ మళ్లీ టార్గెట్ పెట్టాడు!
త్రివిక్రమ్ మళ్లీ టార్గెట్ పెట్టాడు!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించే చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తన హారిక ఆండ్‌ హాసిని సినిమా పతాకంపై రాధాకృష్ణ నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి కల్లా పూర్తిచేసి వచ్చే వేసవి సెలవుల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఊగిసలాటల మధ్య ఈ సినిమా ఓకే కావడం నితిన్‌ అభిమానులకే కాదు.. నితిన్‌కు సైతం ఎంతో సంతోషాన్ని అందిస్తోంది. ఈ చిత్రంతో నితిన్‌ రేంజ్‌ రెట్టింపు అవుతుందనే అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్‌ నితిన్‌తో చేయబోయే చిత్రం యూత్‌ను టార్గెట్‌ చేసి నితిన్‌కు ఉన్న లవర్‌బోయ్‌ ఇమేజ్‌ను పెంచుతుందా?లేక నితిన్‌ను త్రివిక్రమ్‌ తన స్టైల్‌ కుటుంబ కథా చిత్రంగా తీసి ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను తీసుకొస్తాడా? అనేది అందరిలో ఆసక్తిని కలిగించే అంశం అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ