Advertisementt

'బాహుబలి'కి మరో ట్విస్ట్‌!

Sat 01st Aug 2015 12:01 AM
bahubali,kattappa,vijayendra prasad,bahubali movie,ramya krishna  'బాహుబలి'కి మరో ట్విస్ట్‌!
'బాహుబలి'కి మరో ట్విస్ట్‌!
Advertisement
Ads by CJ

రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' విడుదలైన రోజు నుండి ఒకటే ప్రశ్న నెట్‌జనులను, సామాన్య ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. అది మరేదో కాదు... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈ విషయమై సోషల్‌ మీడియాలో నిరంతర చర్చ నడుస్తోంది. అయితే రీసెంట్‌గా ఆ చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో ఇంకో కొత్త ఊహను అభిమానుల్లోకి వదిలాడు. విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... మీరు అసలు కట్టప్ప బాహుబలిని చంపాడని ఎందుకు అనుకుంటున్నారు? అతన్ని కేవలం పొడిచాడు అంతే... అన్నాడు. ఇది విన్న అభిమానులు కట్టప్ప పొడవటం వల్ల బాహుబలి చనిపోలేదనే కంక్లూజన్‌కు వస్తున్నారు. బాహుబలిని రానా చంపి ఉంటాడని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం రమ్యకృష్ణ ఆదేశాల మేరకే బాహుబలిని కట్టప్ప చంపేస్తాడని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ