Advertisementt

వావ్..అఖిల్‌ అంత పనిచేశాడా!?

Fri 31st Jul 2015 08:06 AM
akkineni akhil,vv vinayak,akhil lip lock with sayesha saigal,akhil with sayesha saigal  వావ్..అఖిల్‌ అంత పనిచేశాడా!?
వావ్..అఖిల్‌ అంత పనిచేశాడా!?
Advertisement
Ads by CJ

తన తొలి సినిమాలోనే తన టాలెంట్‌ అంతా చూపించేయాలని గట్టిగా ఫిక్సయ్యాడు అక్కినేని అఖిల్‌. డాన్సులు, ఫైటింగ్‌లు, డైలాగులే కాదు... పక్కా మాస్‌ మసాలా మూవీ ఇవ్వాల్సిందే అని డిసైడ్‌ అయిపోయాడు. దానికి తగ్గట్లుగా వినాయక్‌ కూడా అలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్‌. అన్నట్లు ఈ చిత్రంలో అఖిల్‌ తనదైన రొమాంటిక్‌ లుక్‌ను కూడా చూపించబోతున్నట్లు టాక్‌. తాత అక్కినేని, తండ్రి నాగార్జున ఎంత రొమాంటిక్కో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సిసింద్రీ కూడా తాను ఆ విషయంలోనూ ఏమాత్రం తీసిపోనని చాటి చెప్పాలనుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాలో సాయేషాసైగల్‌తో ఓ ఘాటైన లిప్‌లాక్‌ సీన్‌లో కనిపించబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. సాయేషాకి ఇదే తొలి దక్షిణాది సినిమా. తాను కూడా సదరు సీన్‌లో ఏమాత్రం మోహమాటపడకుండా యాక్ట్‌ చేసేసిందట. మొత్తానికి అఖిల్‌ సినిమాలో ఓ ముద్దు సీన్‌ ఉందన్నమాట! మరి ఆ సీన్‌లో ఏమాత్రం వీరిద్దరూ జీవించారో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంతవరకు ఎదురుచూడాల్సిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ