Advertisementt

పవన్‌ 'సర్దార్‌' కి కోన సూచనలు!

Fri 31st Jul 2015 07:02 AM
pawan kalyan,sardar movie,kona venkat,bobby kona venkat suggestions to sardar  పవన్‌ 'సర్దార్‌' కి కోన సూచనలు!
పవన్‌ 'సర్దార్‌' కి కోన సూచనలు!
Advertisement
Ads by CJ

స్టార్‌రైటర్‌ కోనవెంకట్‌ తన సామ్రాజాన్ని విస్తరించుకుంటున్నాడు. నిన్నటివరకు ఎక్కువగా శ్రీనువైట్ల చిత్రాలకు పనిచేసిన ఆయన ప్రస్తుతం శ్రీనువైట్ల-రామ్‌చరణ్‌ సినిమాకు పనిచేస్తున్నాడు. ఇక బాలకృష్ణ కాంపౌండ్‌లోకి కూడా ఆయన 'డిక్టేటర్‌'తో వెళ్లిపోయాడు. ఇక హీరో రామ్‌ చిత్రాలంటే కోన పేరు ఉండాల్సిందే. ఆయన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు కూడా మంచి సన్నిహితుడు. కాగా ఇటీవలే ఆయనకు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నుండి కూడా పిలుపొచ్చిందిట. దాంతో ఇప్పుడు ఆయన పంచన చేరాడు కోన. సాధారణంగా కోనవెంకట్‌ స్క్రిప్ట్‌ దశ నుండే తన పని ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాల్లో మధ్యలో వచ్చి కొన్ని రిపేర్లు చేస్తుంటాడు. ఇప్పుడు పవన్‌ నుండి కోన పిలుపు అందుకున్నాడు. 'సర్దార్‌' సినిమాకి సంబంధించి పవన్‌కు కోన కొన్ని సూచనలు ఇచ్చాడట. కోన సూచనల మేరకు కథలో పవన్‌ కొన్ని మార్పులు చేయించాడని టాక్‌.మొత్తానికి పవన్‌ దగ్గర తన పనితనం చూపించేశాడు కోనవెంకట్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ