గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో అనుష్క టైటిల్ పాత్రను పోషిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. చారిత్రక సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లుఅర్జున్ సైతం గోనగన్నారెడ్డిగా కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని కొందరు సెంటిమెంట్ రాయుళ్లు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ చిత్రం పంపిణీ హక్కులను నైజాం,. ఉత్తరాంధ్ర ఏరియాలకు దిల్‌రాజు తీసుకోగా, మరో లక్కీహ్యాండ్ అయిన సాయి కొర్రపాటి కృష్ణా ఏరియా హక్కులను భారీ ధర చెల్లించి దక్కించుకున్నాడు. సో.. ఈ ఇద్దరు లక్కీ వ్యక్తులు ఈ చిత్రం పంపిణీ హక్కులను తీసుకోవడంతో మిగతా ఏరియాల బిజినెస్ కూడా ఊపందుకొంది. కాగా ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు కోసం గుణశేఖర్ ఆల్‌రెడీ తెలంగాణ సర్కార్‌లో, ఎపి సర్కార్‌లో తనకు ముఖ్యులైన వారి చేత ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడట. అది కూడా లభిస్తే... ఇక కొంతలో కొంత 'రుద్రమదేవి' విషయంలో గుణశేఖర్ ఊపిరి పీల్చుకోవచ్చు.