ఎవరైనా హీరోలు ఓ కొత్త భాషలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉండే స్టార్ చేత తమ సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడిస్తే... ఆటోమేటిగ్గా ఆ భాషలోని హీరో అభిమానులు పరభాషా వారి పట్ల కూడా కాస్త కనికరం చూపించి, సినిమా నాలుగురోజులు ఆడేందుకు సహాయపడతారు. ఇదే సూత్రాన్ని మహేష్ తన 'శ్రీమంతుడు' చిత్రం కోసం వాడుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో మహేష్ రేంజ్ ఏమిటో.. తమిళంలో విజయ్ స్టామినా కూడా సమానమే. దీంతో విజయ్ చేత తన తమిళ 'శ్రీమంతుడు' గురించి ఓ నాలుగు మాటల మాట్లాడేందుకు మహేష్..విజయ్ తో ప్లాన్ చేసాడంట!. 'శ్రీమంతుడు' తమిళ వెర్షన్ ఆడియో జులై 31న జరుగనుంది. ఆ వెంటనే విజయ్ నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మకచిత్రం 'పులి' చిత్రం ఆడియో ఆగష్టు 2న విడుదలకు సిద్దమవుతోంది. ఈ రెండు చిత్రాలకు సంగీతం అందించింది దేవిశ్రీప్రసాదే. కాగా తమిళంలో విజయ్ 'పులి' ఆడియో వేడుకకు మన మహేష్ అతిధిగా హాజరవ్వడానికి నిర్ణయించుకున్నాడట. సో.. విజయ్‌ను ముందుపెట్టి మహేష్ తన పని కానిచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆల్ ది బెస్ట్ మహేష్!