Advertisementt

సరికొత్త పాత్రలో శృతిహాసన్‌!

Wed 29th Jul 2015 11:29 AM
sruthihassan,veeram movie,ajith,lawyer role  సరికొత్త పాత్రలో శృతిహాసన్‌!
సరికొత్త పాత్రలో శృతిహాసన్‌!
Advertisement
Ads by CJ

శృతిహాసన్‌ త్వరలో మనకు లాయర్‌గా కనిపించి అలరించనుంది. ఆ పాత్ర ఆమెకు కొత్త అని, ఇలాంటి పాత్రలో చేస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె మురిసిపోతోంది. తమిళంలో 'వీరం' సినిమా తర్వాత అజిత్‌, దర్శకుడు శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో శృతిహాసన్‌ లాయర్‌ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటనకు ప్రాదాన్యం ఉన్న పాత్రను పోషిస్తోంది. కాగా ఆమె అజిత్‌ సరసన నటించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో లక్ష్మీమీనన్‌ అజిత్‌కు చెల్లిగా నటిస్తోంది. కోల్‌కత్తా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఇప్పటికే అజిత్‌, శృతిహాసన్‌ మధ్య కొన్ని సన్నివేశాలను కోల్‌కత్తాలో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. కాగా ఇందులో అజిత్‌ ఓ ట్యాక్సీడ్రైవర్‌గా నటిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ