ఎన్టీఆర్‌కు చాలాకాలంగా సరైన హిట్లు లేవు. 'బాద్‌షా' హిట్టయినప్పటికీ కాస్ట్‌ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక ఇటీవల వచ్చిన 'టెంపర్' చిత్రానికి సూపర్‌టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రెండో వారం నుండే డ్రాప్ కావడంతో ఈ చిత్రం కూడా ఆర్ధికంగా లాభాలను మిగల్చలేకపోయింది. ఈ అనుభవంతో కాబోలు ఎన్టీఆర్ ముందుజాగ్రత్తగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం వైపు దృష్టిసారించాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఆయన తాజాగా హైదరాబాద్‌లో ఓ పేరున్న కన్‌స్ట్రక్షన్ కంపెనీ నుంచి 20కు పైగా లగ్జరీ ఫ్లాట్‌లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే హఠాత్తుగా ఎన్టీఆర్ ఇలా ఈ ఫ్లాట్‌లను కొనుగోలు చేయడం వెనుక కారణం ఏమిటి? అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. కొందరు చెబుతున్న దాన్ని బట్టి ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వస్తున్నాడు అని, కొద్దిరోజుల్లోనే ఆ ఫ్లాట్‌లు రెట్టింపు ధర అవుతాయని.. అందుకే ఎన్టీఆర్ అలా కొన్నాడని అంటున్నారు. ఈ ఫ్లాట్‌లలో ఒక్కో ఫ్లాట్ విలువ కోటిన్నర ఉంటుందని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ ముంందుజాగ్రత్తని చూసి మిగతా హీరోలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందనే చెప్పాలి...!