Advertisementt

మహేష్‌ మాట మీద నిలబడతాడా?

Wed 29th Jul 2015 08:56 AM
  మహేష్‌ మాట మీద నిలబడతాడా?
మహేష్‌ మాట మీద నిలబడతాడా?
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు చాలాకాలం నుంచి తమిళ దర్శకులతో సినిమా చేస్తానని చెబుతూ వస్తున్నాడు. వీటికి సంబంధించిన వార్తలు ఎప్పటినుండో వస్తూనే ఉన్నాయి. మణిరత్నంతో చేస్తానని, లింగుస్వామితో చేస్తాడని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కటి పట్టాలు ఎక్కలేదు. ఒక్కటి వర్కౌట్‌ కాలేదు. అయితే మురుగదాస్‌తో ఆయన ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు మహేష్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మహేష్‌ మాట్లాడుతూ... నేను తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషాచిత్రం చేసే ఆలోచనలోనే ఉన్నాను. మురుగదాస్‌తో చేసే అవకాశం ఉంది... అని తేల్చిచెప్పాడు. అలాగే ఈ మధ్యకాలంలో మహేష్‌, మురుగదాస్‌లు ఈ విషయమై చాలాసార్లు కలిశారని, ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోందని మహేష్‌ చెప్పాడు. అంటే త్వరలోనే మహేష్‌ తమిళ సినిమా ఉండబోతోందన్నమాట...! మరి ఈ సారైనా మహేష్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడో? లేక మణిరత్నంకు ఇచ్చినట్లు హ్యాండ్‌ ఇస్తాడో వేచిచూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ