Advertisementt

రాజమౌళికి కూడా విసుగు పుట్టించిందా?

Wed 29th Jul 2015 07:33 AM
tamanna bahubali 2,avanthika in bahubali 2,rajamouli,deva sena anushka  రాజమౌళికి కూడా విసుగు పుట్టించిందా?
రాజమౌళికి కూడా విసుగు పుట్టించిందా?
Advertisement
Ads by CJ

కథాగమనంలో ఎలాంటి ఎత్తుపల్లాలు, ఎమోషన్స్ ఉండాలి, పాత్రోచితంగా ఎటువంటి చమక్కులు నింపాలి అనే అంశాల్లో రాజమౌళిని మించిన దర్శకుడు ప్రస్తుతానికైతే బూతద్దంలో వెతికినా దొరకడు. కథకు అంతటి ప్రాధాన్యం ఇచ్చే జక్కన్న ఇలా ఓ కథే లేని బాహుబలి మొదటి భాగాన్ని అందించి విజయం అయితే సాధించాడు కాని అభిమానుల మనసులని మాత్రం హత్తుకోలేకపోయాడు. అందుకే రెండో భాగంలో ఆ అసంతృప్తిని తొలగించే ప్రయత్నం తప్పక చేయాల్సిన ఆవశ్యకతను గమనించాలి. 

ముఖ్యంగా శివుడు పాత్ర తెర మీద ఆడినంత సేపు ఎటువంటి ఫిర్యాదు చేయని ప్రేక్షకులు అవంతికగా తమన్నా రంగప్రవేశంతోనే రాజమౌళి మీద క్రమేపీ ఆవేశం పెంచుకున్నారు. ఇక శివుడు, అవంతికల ప్రేమ ప్రయాణం విసుగు పుట్టించిన సత్యాన్ని జక్కన్న కూడా ఒప్పుకోక మానడు. అందుకే అవంతిక పాత్రను ఇక్కడే అంతం చేసేయాలని, రెండో భాగంలో పూర్తిగా దేవసేన మీదే దృష్టి కేంద్రీకృతం అయ్యేలా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసే పనిని తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారికి రాజమౌళి అప్పగించినట్టు భోగట్టా. పాపం తమన్నా అంతలా పనికి రాకుండా పోయిందా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ