స్టార్ హీరోలు తప్ప చిన్నవారిని టచ్ చేసే స్థాయిని దాటి వెళ్ళిపోయిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అకస్మాత్తుగా ఓ నిరుద్యోగిలా కనిపిస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి వరస పెట్టి యాభై కోట్ల సినిమాలు అందించినా మనోడి చేతుల్లో ప్రస్తుతానికి సినిమా లేకపోవడం విడ్డూరంగానే కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో అమోఘమైన రిలేషన్స్ ఉన్న త్రివిక్రమ్ అలాగే పవన్ కళ్యాణ్ అంతరాత్మ ప్రభోధకుడిగా కూడా కీర్తి సంపాదించాడు. అత్తారింటికి దారేదితో కుటుంబ విలువలున్న సినిమాలను కూడా ఇండస్ట్రీ హిట్లుగా తీర్చిదిద్దొచ్చు అని నిరూపించాడు.
బడా హీరోలను బాగా డైరెక్ట్ చేసాడు కాబట్టి ఇప్పుడు చిన్న హీరోల అందుబాటులోకి వచ్చేస్తే తనను తానే కించ పరుచుకున్నట్టు అవుతుంది. నితిన్ లాంటి హీరోతో సినిమా అనుకున్నప్పట్టికీ ఇంకా మనస్ఫూర్తిగా ఆ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ అంగీకారం తెలిపినట్టు లేదు. సాటి దర్శకులందరూ వారి వారి కొత్త చిత్రాలను మలిచే పనిలో నిమగ్నం అయి ఉంటె ఈ విక్రముడికి మాత్రం ఎటు పోవాలో పాలుపోని పరిస్థితి. ఏ దిక్కు లేకా, ఏ దిక్కుకు పోవాలో తోచక సమంతాతో హీరోయిన్ ప్రధాన చిత్రమనీ, నితిన్ బాబుతో రొమాంటిక్ కామెడీ అనీ పెద్ద ఆగమ్యగోచరంలో పడిపోయాడు.