వచ్చే ఏడాది డిసెంబర్‌లో సంగీత చక్రవర్తి కీరవాణి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు చాలా కాలం కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు 'బాహుబలి పార్ట్2' ఆయనకు చివరి చిత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎందరు చెప్పినా కూడా కీరవాణి మాత్రం తన మాటకే కట్టుబడి ఉంటానని గట్టిగా చెప్పాడట. 'బాహుబలి' పార్ట్1ను సంగీతపరంగా అద్బుతంగా తీర్చిదిద్ది, రీరికార్డింగ్‌తో సహా పాటలకు కూడా మంచి ట్యూన్స్ అందించి ఆ చిత్రం సాధిస్తున్న ఘనవిజయంలో కీరవాణి కూడా తన భాగం తీసుకున్నాడు. మరి కీరవాణి తర్వాత రాజమౌళి చిత్రాలకు సంగీతం అందించేది ఎవరు? అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా మారింది. కీరవాణి తర్వాత ఆ స్థానాన్ని కళ్యాణిమాలిక్ తీసుకుంటాడని... రాజమౌళికి ఆయనే పర్‌ఫెక్ట్ యాప్ట్ అని కొందరు అంటుంటే... కీరవాణి తర్వాత రాజమౌళికి బాగా నచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాదే అని.. ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు చెప్పాడని, కాబట్టి కీరవాణి తర్వాత ఆ స్థానంలోకి దేవిశ్రీ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కొందరు రాజమౌళి సన్నిహితులు అంటున్నారు.