Advertisementt

మళ్లీ మొదటికొచ్చిన రాజమౌళి కథ!

Tue 28th Jul 2015 07:17 AM
rajamouli,bahubali part 1,bahubali second part  మళ్లీ మొదటికొచ్చిన రాజమౌళి కథ!
మళ్లీ మొదటికొచ్చిన రాజమౌళి కథ!
Advertisement
Ads by CJ

'బాహుబలి' రెండో పార్ట్‌ షూటింగ్‌ అక్టోబర్‌ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సెకండ్‌ పార్ట్‌ విషయంలో రాజమౌళి మైండ్‌సెట్‌ మారింది. ఈ చిత్రం కథలో కీలకమైన మార్పులు చేయాలని ఆయన డిసైడ్‌ అయ్యాడు. వాస్తవానికి పార్ట్‌1 చూసిన వాళ్లకు సెకండ్‌ పార్ట్‌ ఎలా ఉంటుందో ఓ అవగాహన వచ్చేసింది. పార్ట్‌2ల కథ, కథనం, పాత్రల ప్రవర్తన ఏరీతిన సాగుతాయి.. అనే విషయంపై ప్రేక్షకులు ఓ అంచనాలకు వచ్చేశారు. దానికి తోడు 'బాహుబలి' పార్ట్‌2 కథ ఇదేనంటూ కొన్ని కథలు కూడా ప్రచారంలోకి వచ్చేశాయి. అవన్నీ ఇంచుమించు రాజమౌళి అనుకున్న పార్ట్‌2కు దగ్గరగా ఉండటంతో రాజమౌళి ఇరుకునపడ్డాడు. దీంతో కథేంటో తెలిస్తే ప్రేక్షకులకు కిక్‌ ఉండదని భావించిన రాజమౌళి ఇప్పుడు సెకండ్‌ పార్ట్‌లో ఊహించని మలుపులు పెట్టి ఆశ్యర్యపరచడానికి రెడీ అవుతున్నాడట. ఇలా చిన్న చిన్న ట్విస్ట్‌లతో పార్ట్‌2ని రెడీ చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడంటున్నారు. ఇందుకోసం స్క్రిప్ట్‌లో మరలా కసరత్తు ప్రారంభించాడట. మరి ఈ మార్పుల వల్ల సినిమాల్లో కొత్త క్యారెక్టర్లు ఏమైనా ఎంటర్‌ అవుతాయో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ