Advertisementt

అఖిల్‌ కు ఇలియానానే సెట్ చేసారు!

Tue 28th Jul 2015 06:36 AM
akkineni akhil,vinayak,iliyana,item song  అఖిల్‌ కు ఇలియానానే సెట్ చేసారు!
అఖిల్‌ కు ఇలియానానే సెట్ చేసారు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ ప్రేక్షకులు దాదాపు ఇలియానాను మర్చిపోయే దశలో ఉన్నారు. అయితే ఆమెకు టాలీవుడ్‌ నుండి అనుకోని విధంగా పిలుపు వచ్చింది. విషయానికి వస్తే ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో అఖిల్‌ డెబ్యూ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మాంచి ఉపున్న ఓ ఐటంసాంగ్‌ ఉండటంతో ఆ ఐటంను ఇలియానా చేత చేయించాలని మొదట్లో యూనిట్‌ భావించింది. కానీ మరీ అఖిల్‌కు అక్కలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తాజాగా ఇది కేవలం ఐటంసాంగ్‌ కాబట్టి అలాంటి ఫీలింగ్‌ ప్రేక్షకులకు రాదనే ఉద్ధేశ్యంతో యూనిట్‌ మరలా ఇలియానాకే పిలుపు పంపించారు. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. మరి అఖిల్‌తో కలిసి ఇలియానా వేసే రొమాన్స్‌ వేషాలు తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సివుంది...! అన్నట్లు ఈ ఐటెం సాంగ్ కోసం ఇలియానా కి కోటి రూపాయలు ఇవ్వనున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ