Advertisementt

మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకుంటుందా!

Tue 28th Jul 2015 05:56 AM
lavanya tripathi,andala rakshasi,allu aravind,allu sireesh  మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకుంటుందా!
మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకుంటుందా!
Advertisement
Ads by CJ

'అందాల రాక్షసి' ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి. ఆ తర్వాత ఆమెకు 'దూసుకెళ్తా' చిత్రంలో అవకాశం వచ్చినా ఆమె కెరీర్‌ దూసుకెళ్లలేకపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు కెరీర్‌ ఓ గాడిలో పడుతున్నట్లు అర్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో యంగ్‌ నాగార్జునకు జోడీగా నటిస్తోంది. అలాగే గీతాఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంలో నాని సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పర్‌ఫార్మెన్స్‌కు, స్క్రీన్‌ ప్రజెషన్స్‌కు ఇంప్రెస్‌ అయిన అల్లుఅరవింద్‌ తన చిన్న కుమారుడు అల్లుశిరీష్‌ హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రంలో ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు లావణ్యత్రిపాఠినే హీరోయిన్‌గా ఎంపికచేశారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి మెగా హీరోలు తమ హీరోయిన్స్ ని ఎలా చేంజ్ చేస్తుంటారో తెలిసిందే కాబట్టి..లావణ్య కూడా మెగా హీరోలందరితో నటించి మెగా హీరోయిన్ ముద్ర వేయించుకుంటుందేమో చూద్దాం! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ