మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా దేశభక్తి, సైనికులు, ప్రేమ.. ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ అభ్యుదయ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' సినిమాను మొదట గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్2న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ డేట్‌న 'కంచె' విడుదల కాకపోవచ్చని సమాచారం. అక్టోబర్ అనేది దసరా సీజన్ కాబట్టి సెలవులను ఉపయోగించుకోవడానికి ఈ సమయంలో బోలెడు సినిమాలు సన్నద్దం అవుతున్నాయి. అందులో మెగాహీరోల చిత్రాలైన 'సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్'తో పాటు రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పోటీ పడటం ఇష్టంలేని నాగబాబు తన కుమారుడి సినిమాను సేఫ్‌జోన్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట...! దీంతో ఈ చిత్రం గాంధీ జయంతికి రాకపోవచ్చని సమాచారం.