సోషల్ స్టేటస్ అంటే సమాజంలో మనిషిని మనిషిగా గుర్తించే ఒక సాధారణ ప్రాతిపదకే అయినప్పట్టికీ మారుతున్న స్థితిగతులను బట్టి దీని డెఫినిషన్ కూడా ఎప్పటికప్పుడు మారుతుంది. ఇదే సోషల్ స్టేటస్ మీద రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపే దిశగా అడుగులు వేస్తున్నాయి. బాహుబలి, బజరంగి భాయ్ జాన్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారి తదుపరి స్వప్నం తెలంగాణా చరిత్రను, ఇక్కడి ప్రజల అమాయకపు మనోభావాలాను, స్వచ్చమైన ఆప్యాయతలను తెర మీద నిర్వచించడమే.
'ఆంధ్రాకి వెళితే ఏం చేస్తావు బాబూ? నాన్న గారు ఏం చేస్తారు? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. అదే తెలంగాణలో పలకరిస్తే బాబూ చాయ్ తాగుతవా? అన్నం తింటవా? అంటూ సోషల్ స్టేటసుతో సంబంధం లేకుండా, పట్టించుకోకుండా ఆప్యాయంగా అడుగుతారు. ఇది నాకు బాగా నచ్చుతుంది,' అని విజయేంద్ర ప్రసాద్ గారు తన మనసులోని మాటని, స్వీయానుభాలని జతకలిపి చెప్పారు.
ఇంకేముంది, మాకు అతిథి మర్యాదలు తెలియవా, మాకు అంత కూడా సంస్కారం లేదంటారా అని విజయేంద్ర ప్రసాద్ గారి పైన ఆంధ్రా అటాక్ మొదలయింది. ఇంకొందరైతే ఆంధ్రాలో సోషల్ స్టేటస్ కేవలం కులం ఆధారంగా నిర్ణయించబడుతుంది అని ఇంకో కుండ బద్దలుకొట్టారు. తెలంగాణా సామాజిక అంశం కాస్తా ఆంధ్ర ప్రదేశ్ కులసమస్యగా రూపాంతరం చెంది, విజయేంద్ర ప్రసాద్ గారికి కొత్త తలనొప్పిగా దాపురించేలా తయారవుతోంది.