వాస్తవానికి 'పవర్' దర్శకుడు బాబి అలియాన్ రవీంద్ర స్వతహాగా రచయిత. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'సర్దార్' చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే... ఈ చిత్రానికి బాబి కేవలం దర్శకత్వ బాధ్యతలే నిర్వహించనున్నాడు. మాటలను 'గోపాల గోపాల' ఫేమ్ సాయిమాధవ్ బుర్రా అందిస్తున్నాడు. ఈమధ్య కాలంలో సాయిమాధవ్ బుర్రాకు మంచి ఆఫర్లు, మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ రైటర్‌గా మాత్రం ఆయనకు గుర్తింపు రాలేదు. ఆలోటును పవన్‌కళ్యాణ్ 'సర్దార్' తీరుస్తుందనే ఆశతో ఉన్నాడు. స్వతహాగా మాటల రచయిత అయినప్పటికీ తనకు అలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో దర్శకుడు బాబి కాస్త అసంతృప్తితో ఉన్నాడట. మరి బాబి ప్లేస్‌లో సాయి మాధవ్‌ను పెట్టుకొని మంచి అవకాశం ఇచ్చిన పవన్ నమ్మకాన్ని ఆయన ఏమేరకు నిలుపుకుంటాడో వేచిచూడాల్సివుంది...!