Advertisementt

రాజమౌళిపై తండ్రి పెత్తనం!

Mon 27th Jul 2015 12:22 PM
rajamouli,vijayendhraprasad,bahubali,bhajarangi bhaijaan  రాజమౌళిపై తండ్రి పెత్తనం!
రాజమౌళిపై తండ్రి పెత్తనం!
Advertisement
Ads by CJ

'బాహుబలి' తర్వాత రాజమౌళి ఇక తెలుగులో చిత్రాలు చేయడని, ఆయన బాలీవుడ్‌కు వెళ్లిపోతాడనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ మాత్రం రాజమౌళిని బాలీవుడ్‌కు వెళ్లమని తెగ విసిగిస్తున్నాడట. అన్నట్లు విజయేంద్రప్రసాద్‌ కథను అందించిన 'భజరంగీ భాయిజాన్‌' చిత్రం మంచి హిట్‌ అయి, రచయితగా ఆయనకు మంచి పేరు రావడంతో ఆయన తన కొడుకుతో కూడా బాలీవుడ్‌ రేంజే వేరు.. టాలీవుడ్‌లో లాగా బాలీవుడ్‌లో కూడా వరుసగా విజయాలు లభిస్తే ఇక కెరీర్‌కు, పేరుప్రతిష్టలకే కాక, ఆర్థికంగా తిరుగు ఉండదని, బాలీవుడ్‌లో చేస్తే ఎలాంటి గుర్తింపు వస్తుందో 'భజరంగీ భాయిజాన్‌'తో తనకు అనుభవమైందని అంటున్నాడట. అందుకు ఉదాహరణగా ప్రభుదేవాను చూపిస్తూ, గొప్ప డైరెక్టర్‌ కాకపోయినప్పటికీ అతని రేంజ్‌ ఏందో పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోమని రాజమౌళిపై ఆయన తండ్రి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ