Advertisementt

'బాహుబలి'ని చూసి 'పులి' వాతలు పెట్టుకుంటోందా?

Mon 27th Jul 2015 09:27 AM
bahubali,puli,vijay,prabhas,simbudevan,shankar  'బాహుబలి'ని చూసి 'పులి' వాతలు పెట్టుకుంటోందా?
'బాహుబలి'ని చూసి 'పులి' వాతలు పెట్టుకుంటోందా?
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రం తమిళ వెర్షన్‌కు ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి. ప్రభాస్‌తో తమకు పెద్దగా పరిచయం లేనప్పటికీ ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్‌ వర్గాలతో పాటు విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పుడు 'బాహుబలి'లాంటి విజయం తెలుగులో మేమూ సాధించగలం అని ఓ తమిళ డైరెక్టర్‌, హీరో కనిపించిన అందరికీ చెబుతున్నారని కోలీవుడ్‌ సమాచారం. తమిళస్టార్‌ హీరో విజయ్‌కు తమిళనాడులో ఎంతో క్రేజ్‌ ఉంది. ఆయన హీరోగా, శ్రీదేవి ప్రత్యేకపాత్రలో, హన్సిక, శృతిహాసన్‌ హీరోయిన్లుగా 'పులి' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంటర్నెట్‌లో వీక్షించిన వారి సంఖ్య 'బాహుబలి' కంటే ఎక్కువ అని తమిళనాడులో ప్రచారం మొదలైంది. అయినా తమిళంలో ప్రభాస్‌కు ఎలాంటి ఫాలోయింగ్‌ లేదో.. విజయ్‌కు కూడా తెలుగులో అంతగా గుర్తింపులేదు. అయితే బడ్జెట్‌ పరంగా చూస్తే 'పులి' కూడా దాదాపు 'బాహుబలి' ది బిగినింగ్‌కు సమానంగానే ఉంది. ఈచిత్రానికి శంకర్‌ శిష్యుడు శింబుదేవన్‌ దర్శకుడు. ఈ మూవీ సెప్టెంబర్‌ 17న ఒకేరోజు తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. మరి తమిళులు 'బాహుబలి'ని అభిమానించినంతగా 'పులి'ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో చూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ