Advertisementt

యువ మెగాహీరోల పాట్లు దేనికోసం?

Mon 27th Jul 2015 06:04 AM
sai dharam tej,varun tej,krish,dil raju,kanche  యువ మెగాహీరోల పాట్లు దేనికోసం?
యువ మెగాహీరోల పాట్లు దేనికోసం?
Advertisement
Ads by CJ

మెగాహీరోలంటే మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఇమేజ్‌ను ఎక్కువగా కోరుకుంటారు. ప్రేక్షకులు కూడా ఇంతవరకు మెగాహీరోలను మాస్‌ సాత్రల్లోనే చూసి ఆదరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా తెరంగేట్రం చేసిన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లు మాత్రం కేవలం యాక్షన్‌ అండ్‌ మాస్‌ ఇమేజ్‌ ఛట్రంలో చుట్టుకోకుండా ఆల్‌రౌండర్లుగా నిరూపించుకోవాలని తహతహలాడుతూ అలాంటి సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. వరుణ్‌తేజ్‌ విషయానికి వస్తే... 'ముకుంద' వంటి సాఫ్ట్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విభిన్న కథాంశాలను ఎంచుకునే క్రిష్‌ దర్శకత్వంలో 'కంచె' చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక తన మూడో చిత్రంగా పక్కా పూరీ టైప్‌ క్యారెక్టరైజేషన్‌తో సాగే 'లోఫర్‌'చిత్రం చేసున్నాడు. సాయిధరమ్‌తేజ్‌ విషయానికి వస్తే... తన మొదటి రెండు చిత్రాలు 'పిల్లా నువ్వులేనిజీవితం' రేయ్‌' చిత్రాలలో మాస్‌ టచ్‌ ఇచ్చిన సాయి.. దిల్‌రాజు బేనర్‌లో హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో విభిన్న పాయింట్‌తో తెరకెక్కుతోన్న 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ కుటుంబ కథా చిత్రంగా రూపొందే 'శతమానం భవతి' చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి కూడా దిల్‌రాజునే నిర్మాత కావడం విశేషం. అదే సమయంలో రొమాంటిక్‌ హీరోగా కూడా పేరు తెచ్చుకోవడానికి లవర్‌బోయ్‌ వేషంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో ఆయన ఏకంగా ఐదుగురు భామలతో రొమాన్స్‌ చేయనున్నాడట. కళ్యాణ్‌రామ్‌తో 'ఓం' 3డి చిత్రానికి దర్శకత్వం వహించిన సునీల్‌రెడ్డి డైరెక్టర్‌. ఈ చిత్రం శ్రీవెంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై రోహిణిరెడ్డి నిర్మాతగా రూపొందనుంది. 'శతమానంభవతి'తో పాటు ఈ చిత్రాన్ని కూడా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సాయి భావిస్తున్నాడట....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ