మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఈ మూవీకి 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఇంతకాలం రామ్‌చరణ్ నటించిన సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన చిత్రాలకు శాటిలైట్ రైట్స్ ఎనిమిది నుండి తొమ్మిది కోట్ల రేంజ్‌లో ఉండేవి. అలాగే ఓవర్‌సీస్‌లో కూడా రామ్‌చరణ్‌కు పెద్దగా క్రేజ్ లేదనే పాయింట్‌తో ఓవర్‌సీస్ రైట్స్ కూడా పెద్దగా ధర పలికేవి కావు. కానీ రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రానికి మాత్రం ఓవర్‌సీస్‌లో మంచి రేట్‌కు అమ్ముడైన విషయం తెలిసిందే. అంత పెద్ద మొత్తానికి ఓవర్‌సీస్ రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ చిత్రాన్ని 13కోట్లకు జీ టీవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఒకేసారి తెలుగు, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఏకమొత్తంగా ఇంత రేటుకు కొన్నారు. ఇది రామ్‌చరణ్ నిర్మాతకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ విషయాలను గమనిస్తే రామ్‌చరణ్ రేంజ్ పెరిగినట్లుగా మెగాభిమానులు భావిస్తున్నారు. కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం అది శ్రీనువైట్ల పుణ్యమే అంటున్నారు. వాస్తవానికి 'ఆగడు'తో డిజాస్టర్ ఫలితం పొందిన తర్వాత శ్రీనువైట్లకు అసలు కనుచూపుమేరలో ఎలాంటి అవకాశం కనిపించలేదు. అయితే శ్రీనువైట్లను ప్రత్యేకంగా పిలిపించి మరీ రామ్‌చరణ్ అవకాశం ఇచ్చాడు. అంతేకాదు.. ఆయనతో విడిపోయిన స్టార్ రైటర్స్ కోనవెంకట్-గోపీమోహన్‌లను మరలా శ్రీనువైట్లతో కలిసి పనిచేసేలా ఒప్పించగలిగాడు. ప్రకాష్‌రాజ్ విషయంలో కూడా అదే జరిగింది. మరి రామ్‌చరణ్ సినిమా ఇంత క్రేజ్ సంపాదించడానికి కారణం రామ్‌చరణా? లేక శ్రీనువైట్లనా? లేక కోనవెంకట్-గోపీమోహన్‌లు ఈ సినిమాకు పనిచేయడమా? అనే కోణంలో చర్చ జరుగుతోంది.