Advertisementt

'శ్రీమంతుడు'కి 'బాహుబలి'తో పోటీనా?

Mon 27th Jul 2015 05:39 AM
sreemanthudu,mahesh babu,bahubali,thamil,selvanandan  'శ్రీమంతుడు'కి 'బాహుబలి'తో పోటీనా?
'శ్రీమంతుడు'కి 'బాహుబలి'తో పోటీనా?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి క్రేజ్‌ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే తమిళంలో కూడా తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ను అదేరోజున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా రెండు భాషల్లో ఒకేసారి విడుదల కావడం మహేష్‌ సినిమాకు ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి తమిళంలో 'సెల్వనందన్‌' టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలై తమిళంలో కూడా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న 'బాహుబలి' చిత్రంతో 'శ్రీమంతుడు'కి ఇటు తెలుగు, అటు తమిళ్‌లో ఒకేసారి పోలిక వస్తుందేమో అనే భయం 'శ్రీమంతుడు' నిర్మాతలకే కాదు... దర్శక, హీరోలకు కూడా టెన్షన్‌ ఏర్పడుతోంది. కాగా ఈ చిత్రం తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ను, తమిళనాడులో తెలుగు వెర్షన్‌ రైట్స్‌ను సత్యం సినిమాస్‌ వారు సొంతం చేసుకున్నారు. తమిళనాడులో ఈ చిత్రాన్ని దాదాపు 200లకు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాలను పోలుస్తూ ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్‌ మధ్య తీవ్ర చర్చ జరుగుతుండటం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ