Advertisementt

'మహేష్‌ కంటే పవనే బెటర్'- స్టార్ నిర్మాత

Mon 27th Jul 2015 02:48 AM
mahesh babu,pawan kalyan,anil sunkara,14 reels banner  'మహేష్‌ కంటే పవనే బెటర్'- స్టార్ నిర్మాత
'మహేష్‌ కంటే పవనే బెటర్'- స్టార్ నిర్మాత
Advertisement
Ads by CJ

14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మహేష్‌తో మూడు సినిమాలు తీసింది. ఈ మూడు చిత్రాలకు హోల్‌సేల్‌గా ఓ రేటు చెప్పి, ఓ ప్యాకేజీగా సింగిల్‌ పేమెంట్‌తో వారి నుండి పూర్తి మొత్తం తీసుకున్నాడు మహేష్‌. అయితే 'దూకుడు' చిత్రం మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన '1' (నేనొక్కడినే), 'ఆగడు' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో సర్వం కోల్పోయిన 14రీల్స్‌ సంస్థ అధినేతలు వీధినపడాల్సిన పరిస్థితి దాపురించింది. మూడు సినిమాలకు ఒకేసారి రెమ్యూనరేషన్‌ తీసుకున్న సమయంలో మహేష్‌ ఆ నిర్మాతలకు.. మీకు నా సినిమాల వల్ల ఏ నష్టం వచ్చినా మీకు మరో సినిమా ఉచితంగా చేస్తానని మాట ఇచ్చాడట. దీంతో మహేష్‌తో చిత్రం విషయంలో నిర్మాతలకు ఆశ చావలేదు. మాకేం ఫ్రీగా చేయనవసరం లేదు. రెమ్యూనరేషన్‌ తీసుకొని తమకో సినిమా చేసి ఒడ్డున పడేయాలని వారు మహేష్‌ చుట్టూ తిరుగుతున్నారట. కానీ మహేష్‌ మాత్రం తెలివిగా తప్పించుకుంటూ అదిగో ఇదిగో ఆని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నాడని, చిటెకెల పందిరి వేయిస్తున్నాడని సమాచారం. నిజానికి మహేష్‌ డైరీ మరో రెండేళ్ల వరకు బిజీ. దీన్నిబట్టి 14రీల్స్‌కు మహేష్‌ ఇప్పట్లో సినిమా చేసే చాన్స్‌లేదు. ఈ విషయంలో అనిల్‌ సుంకర మాత్రం 'మహేష్‌ కంటే పవన్‌ మేలు. బండ్లగణేష్‌ లాంటి వాడికి కూడా ఫ్లాప్‌ ఇచ్చిన వెంటనే మరో సినిమా అవకాశం ఇచ్చాడు.. మహేష్‌ది ఆ మనస్తత్వం కాదని' తన సన్నిహితులతో వాపోయాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి వ్యక్తిత్వం పరంగా పవన్‌, మహేష్‌ల్లో ఎవరిది గ్రేట్‌ అనే విషయాన్ని వీక్షకులే తేల్చాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ