Advertisementt

విజయ్‌కి కట్టప్ప షాక్‌!

Mon 27th Jul 2015 02:24 AM
vijay,kattappa,bahubali,puli,satyaraj  విజయ్‌కి కట్టప్ప షాక్‌!
విజయ్‌కి కట్టప్ప షాక్‌!
Advertisement
Ads by CJ

తమిళనాడులో స్టార్‌ హీరో విజయ్‌ చిత్రంలో అవకాశం వస్తే ఎవ్వరూ కాదనరు. ఆయనకు అక్కడ ఉన్న క్రేజ్‌ అలాంటిది.అందులోనూ విజయ్‌కు పోటీగా పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర వస్తే ఎవరు నో చెబుతారు? కానీ కట్టప్ప మాత్రం అంతపనీ చేశాడు. ఈమధ్య తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తున్న సత్యరాజ్‌ను విజయ్‌ అప్‌కమింగ్‌ మూవీలో విలన్‌గా చేయమని రిక్వెస్ట్‌ చేశారట. కానీ సత్యరాజ్‌ ఆ పాత్ర చేయడానికి నో చెప్పాడట. 'బాహుబలి' ద్వారా అద్భుతమైన పేరు తెచ్చుకోవడంతో ఆయన్ను పెట్టుకుంటే బాగా వర్కౌట్‌ అవుతుందని భావించిన యూనిట్‌కు ఇలా షాక్‌ తగిలిందని కోలీవుడ్‌ సమాచారం. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి తమిళులకు ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం ఎక్కువ. దీంతో కొందరు సత్యరాజ్‌ తెలుగులో సినిమాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ.. తమను చిన్నచూపు చూస్తున్నాడని అంటూ అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ