Advertisementt

ఈ సినిమా కి కళ్లద్దాలు కావాల్సిందేనట!

Mon 27th Jul 2015 02:20 AM
rudhramadevi,anushka,3d glasses,gunasekhar,bahubali  ఈ సినిమా కి కళ్లద్దాలు కావాల్సిందేనట!
ఈ సినిమా కి కళ్లద్దాలు కావాల్సిందేనట!
Advertisement
Ads by CJ

ఇండియన్‌ ఇండస్ట్రీలో తొలి 3డి స్టీరియో స్కోపిక్‌ హిస్టారికల్‌గా రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, రానాలతో పాటు పలువురు ప్రసిద్ది చెందిన తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తర్వాత సెప్టెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాత గుణశేఖర్‌ ప్రకటించాడు. దీంతో అనేక అనుమానాలకు తెరపడింది. ఈ చిత్రాన్ని అదే రోజున తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం 3డి మూవీగా రూపొందుతున్నప్పటికీ కళ్లాద్దాలు (3డి అద్దాలు) పెట్టుకోకుండా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతోందని అందరూ భావించారు. అయితే ఈ విషయాన్ని గుణశేఖర్‌ కొట్టిపారేశాడు. ఈ చిత్రాన్ని 3డి అనుభూతి పొందాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అని తేల్చిచెప్పాడు. కాగా 'బాహుబలి' విడుదల సమయంలో ఆ యూనిట్‌ చేసిన విధంగానే ఈ చిత్రంలోని క్యారెక్టర్ల స్పెషల్‌ లుక్‌లను రోజుకొకటి విడుదల చేస్తూ ప్రమోషన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో హిట్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ