Advertisementt

పవర్‌స్టార్‌ ఫాన్స్ కి గుడ్ న్యూస్!

Mon 27th Jul 2015 01:08 AM
pawan kalyan,sardar,gabbar singh 2,power star  పవర్‌స్టార్‌ ఫాన్స్ కి గుడ్ న్యూస్!
పవర్‌స్టార్‌ ఫాన్స్ కి గుడ్ న్యూస్!
Advertisement
Ads by CJ

ఇటీవల వరకు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఓ రుషిలా గడ్డం పెంచేసి ఉన్నాడు. ఇదంతా ఆయన నటించబోయే 'సర్ధార్‌' చిత్రం కోసమే అని అందరూ భావించారు. కానీ ఆ గెటప్‌ సినిమా కోసం కాదని, ఆయన గడ్డంపెంచడంలో ఏ విశేషమూ లేదని తెలుస్తోంది. దానికి కారణం ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ గడ్డంతీసేని ఫ్రెష్‌ లుక్‌లోకి వచ్చాడు. త్వరలో ప్రారంభం కానున్న 'సర్ధార్‌' చిత్రం కోసం ఆయన ఇలా ఫ్రెష్‌గా ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో ఈనెల 29 నుండి పాల్గొంటాడు. పవన్‌ ఏది చేసినా అది ఒక పెద్ద మేటర్‌ కావడం సాధారణం అయిపోయింది. ప్రేక్షకుల్లో ఆయనకున్న స్పెషల్‌ క్రేజే దీనికి కారణం అని చెప్పవచ్చు. మొత్తానికి 'గబ్బర్‌సింగ్‌2' టైటిల్‌ను తీసేసి, 'సర్దార్‌' అనే టైటిల్‌ పెట్టిన శుభముహూర్తంలో పవన్‌ మరలా తన ఒరిజినల్‌ గెటప్‌లోకి రావడం పవన్‌ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ