దక్షిణాది సినిమాలంటే కేవలం తమిళ సినిమాలే అని ఇంతకాలం భావిస్తూ వచ్చారు బాలీవుడ్ సినీ జనాలు. తెలుగులో సినిమాలు తెరకెక్కినా వాటి పరిధి చాలా చిన్నదనేది వారి అభిప్రాయం. కానీ రీసెంట్‌గా రిలీజైన 'బాహుబలి' సినిమా చూసిన బిటౌన్ జనాలు ఇకపై తమకు తెలుగు సినిమాలే పోటీ అవుతాయా? అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు దేశమంతా రాజమౌళి గురించే చర్చించుకుంటూ ఉండటంతో కోలీవుడ్ స్టార్ మూవీ మేకర్ శంకర్‌లో కసి పెరిగిపోయిందట. దీంతో నిన్న మొన్నటి వరకు 'రోబో2' సినిమాకు 200కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించిన ఆయన ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్‌ను 300కోట్ల దాకా పెంచాడని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో విలన్ పాత్రను విక్రమ్‌తో చేయించాలని నిన్నటివరకు భావించిన ఆయన ఎలాగైనా ఇప్పుడు ఆ స్థానంలో బాలీవుడ్ స్టార్‌ను ఒప్పించి ఈ సినిమాకు బాలీవుడ్‌లో 'బాహుబలి' కంటే క్రేజ్ తేవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడట. మరి రాజమౌళిని బీట్ చేయాలని కలలు కంటున్న శంకర్ ఆ పని చేయగలడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.