Advertisementt

మహేష్‌కు ఆ సత్తా ఉందా?

Sun 26th Jul 2015 04:13 AM
mahesh babu,jamesbond,krishna,ss rajamouli,jayanth c paranji  మహేష్‌కు ఆ సత్తా ఉందా?
మహేష్‌కు ఆ సత్తా ఉందా?
Advertisement
Ads by CJ

గత కొద్దిరోజులుగా మహేష్‌బాబు, రాజమౌళిల ప్రాజెక్ట్‌ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపుతుందని మహేష్‌ అభిమానులు ఎంతో ఆత్రంగా ఉన్నారు.  ఈ చిత్రం గురించి ఫిల్మ్‌నగర్‌ సమాచారం ప్రకారం... ఈ చిత్రం తెలుగు జేమ్స్‌బాండ్‌ చిత్రంగా ఉంటుందని, మహేష్‌బాబును టాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌గా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఒకప్పుడు మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణకు ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టిన ఈ తరహా చిత్రాలను కృష్ణ వారసుడైన మహేష్‌కు సంక్రమించే విధంగా చేయడం ఈ చిత్రం లక్ష్యమని అంటున్నారు. అలాగే హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌ చిత్రాల మాదిరే ఈ చిత్రానికి కూడా వరుసగా సీక్వెల్స్‌ను తీసుకునేందుకు వీలయ్యేందుకు అనుగుణంగా కథ, కథనాలు ఉంటాయని అంటున్నారు. అయితే మహేష్‌తో గతంలో ఆయన ప్రాణస్నేహితుడు జయంత్‌ సి.పరాన్జీ తనకున్న యావదాస్థిని ఖర్చుపెట్టి అదే కోవలో 'టక్కరిదొంగ' తీసి అటు నిర్మాతగా, ఇటు డైరెక్టర్‌గా వీధినపడ్డాడు. మహేష్‌ కుటుంబవ్యవహారాలలో సైతం జోక్యం చేసుకొని మహేష్‌ పెళ్లి విషయంలో కూడా తానే ముందుండి నడిచిన జయంత్‌ ఆ తర్వాత మరలా ఆర్థికంగా కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత మహేష్‌ సైతం జయంత్‌ సి.పరాన్జీని వాడుకున్నంతకాలం వాడుకొని ఓ సినిమా చాన్స్‌ ఇస్తానని చెప్పి ఆ తర్వాత మొహం చాటేశాడు. ఇలా తాను అన్నింటిని లెక్కపెట్టకుండా సహాయం చేసిన నా మిత్రుడైన ఓ నటుడు తను దీనస్థితిలో ఉన్నప్పుడు కనీసం మాటసాయం కూడా చేయలేదని మహేష్‌ పేరు చెప్పకుండా ఆయన్ను ఉద్దేశించి జయంత్‌ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అలా మహేష్‌ను ఆల్‌రెడీ ఓ మంచి డైరెక్టర్‌ జేమ్స్‌బాండ్‌గా మార్చి 'మోసగాళ్లకు మోసగాడు'ని చేయబోయి చివరకు తనే మోసగాడిగా మిగిలిపోయాడు. ఇవ్వన్నీ తెలిసి మరీ రాజమౌళి అంత రిస్క్‌ చేస్తాడా? అన్నదే అసలు సమస్య. మొత్తానికి జేమ్స్‌బాండ్‌ సినిమా తీయాలని మహేష్‌ ఫిక్సయితే అది హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌లా ఉంటుందా? లేక అల్లరినరేష్‌ 'జేమ్స్‌బాండ్‌'లా ఉంటుందా? అన్నదే అసలు సందేహం...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ